మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 13 నవంబరు 2020 (17:38 IST)

ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్ కేసులు..

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా 2 వేలలోపే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1728 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో 8,49,705 కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 9 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 6,837 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 20,857 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 8,22,011 మంది రికవరీ అయ్యారు. 
 
అయితే కరోనాతో చిత్తూరు 3, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. కరోనా భయం నీడలో పాఠశాలలు కొనసాగుతున్నాయి. 
 
జూన్‌లో పునః ప్రారంభం కావాల్సిన పాఠశాలలు.. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది ఆలస్యంగా తెరచుకున్నాయి. ప్రభుత్వం ఎట్టకేలకు ఈ నెల 2వ తేదీ నుంచి 9, 10 తరగతులకు బోధన ప్రారంభించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ.. తరగతులు నిర్వహిస్తోంది. కొంతమంది ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో పాజిటివ్‌ లక్షణాలు బయట పడుతుండడంతో అంతటా కలవరం రేగుతోంది.