సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 11 మే 2019 (11:23 IST)

జనసేన కింగ్ మేకర్‌గా మారితే.. మద్దతు ఇవ్వాలో లేదో కల్యాణ్ నిర్ణయిస్తాడు..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై మెగా బ్రదర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిని సీఎం కానివ్వను అని పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తావించారు. కల్యాణ్ బాబు జగన్‌ను సీఎం కానివ్వడు. చంద్రబాబునూ సీఎం కానివ్వడు అంటూ నాగబాబు చెప్పారు. 
 
పరిస్థితులు అనుకూలిస్తే.. పవన్ కల్యాణ్ సీఎం అవుతాడేమోనని నాగబాబా కామెంట్స్ చేశారు. తమకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కానీ, వైసీపీ అధినేత జగన్‌తో కాని ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టం చేశారు. 
 
జనసేన కింగ్ మేకర్‌గా మారితే ఎవరికి మద్దతు ఇవ్వాలో పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారని నాగబాబు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చాకే తాము తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. టికెట్లను అమ్ముకున్నారన్న ప్రచారం కేవలం మీడియా సృష్టి మాత్రమేనని నాగబాబు స్పష్టం చేశారు. తాము ఎవ్వరికీ టికెట్లు అమ్ముకోలేదని తేల్చి చెప్పేసారు.