ఘనంగా తన పుట్టిన రోజు జరుపుకున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా

Roja
వి| Last Modified మంగళవారం, 17 నవంబరు 2020 (15:00 IST)
అటు సినిమాల్లో ఇటు రాజకీయంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు రోజా. ఆమె నేడు తన 48వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు సినిమా సెలబ్రిటీలు, రాజకీయనేతలు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

గత రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు రోజా. దీనికి సంబంధించిన ఫోటోలను రోజా సోషల్ మీడియా ద్వారా షేర్ చెయ్యగా ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. 1972వ సంవత్సరం నవంబరు 17న నాగరాజు రెడ్డి, లలిత దంపతులకు చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో రోజా జన్మించారు. ప్రేమ తపస్సు సినిమాలో పీరోయిన్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంది.

ఆ తర్వాత తమిళ, తెలుగు సీనియర్ హీరోలతో పలు సినిమాలు చేసి ప్రశంసలు అందుకున్నారు. రోజా తమిళ దర్శకుడు ఆర్ కే సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న రోజా పలు షోలకు మాత్రం జడ్జిగా వ్యవహరిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :