శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 నవంబరు 2020 (21:02 IST)

బీహార్‌లో కొలువు దీరిన నితీశ్ సర్కారు.. ఇద్దరు ఉపముఖ్యమంత్రులతో..?

Nitish kumar
బీహార్‌లో నితీశ్ కుమార్ సర్కారు కొలువు దీరింది. ఈ క్యాబినేట్‌లో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు, 12 మంతి మంత్రివర్గ సహచరులున్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు మరి కొంతమంది బీజేపీ సీనియర్లు హాజరయ్యారు.
 
నితీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆర్జేడీ బహిష్కరించింది. బీహార్‌లో సుపరిపాలన కొనసాగుతుందని ప్రకటించారు నితీశ్. నితీశ్ కుమార్ వరుసగా నాలుగోసారి.. పొలిటికల్ కెరీర్‌లో ఏడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ పగూ చౌహాన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
 
నితీశ్‌ కుమార్‌‌తో పాటు మరో 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు. బీహార్ బీజేఎల్పీ నేత తార్‌కిషోర్ ప్రసాద్, రేణుదేవి డిప్యూటీ సీఎంలుగా ఉంటారు. మరో 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
 
బీజేపీకి మంత్రి పదవులు ఎక్కువగా దక్కనున్నాయి. బీహార్‌లో ప్రతిపక్షాల ఆటలు సాగవని.. అభివృద్ధి కొనసాగుతుందని బీజేపీ నేతలు తెలిపారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సుశీల్ మోడీ అసంతృప్తితో ఉన్నారన్న వ్యాఖ్యల్ని పార్టీ నేతలు ఖండించారు.