శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 31 డిశెంబరు 2021 (16:51 IST)

సోష‌ల్ మీడియాలో పోస్ట్ ల‌పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రోజా

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే పనిలో భాగంగా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ, జిల్లా మంత్రులపైన, తనపైనా సోషల్‌మీడియా వేదికగా అసత్య ప్రచారం చేసేవారిపై చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే రోజా డిమాండు చేశారు. ఏపీ డీజీపీని సైతం వారి అసత్య ప్రచారాలకు పావుగా వాడుకొన్న వారిని శిక్షించాలని ఎమ్మెల్యే ఆర్కే రోజా చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్‌ కుమార్‌కు వినతి పత్రం సమర్పించారు. 
 
 
అక్కచెల్లెళ్ళ‌కు సొంత ఇల్లు కట్టించి వారికి ఆస్తి హక్కు కల్పించేందుకు జగనన్న ప్రత్యేక శ్రద్ద చూపుతుంటే, దాన్ని ఆపేందుకు టీడీపీ నాయకులు కోర్టుల్లో కేసులు వేశార‌న్నారు. కోర్టు ఆ కేసు కొట్టేస్తే పేదలు నిశ్చింతగా నేడు ఇల్లు కట్టుకుంటున్నారని, ఆ ప్రక్రియను ఆపడానికి వైఎస్సార్‌సీపీలోని కొందరు కోవర్టులు టీడీపీతో చేతులు కలపడం దురదృష్టకరమన్నారు. పేదలకు సరఫరా చేసే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారంటూ వాట్సప్‌ గ్రూపుల్లో పెట్టడం, వారే వీడియో తీసి దాన్ని టీవీ5కు ఇవ్వడం ఆ క్లిప్పింగ్‌లు మళ్లీ గ్రూపులో పెట్టి ప్రజలను రెచ్చగొట్టి పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే పనులు చేస్తున్నారన్నారు. 
 
 
మైన్స్‌కు, పంచాయతీరాజ్‌కు మన జిల్లాకు చెందిన వారే మంత్రిగా ఉన్నారని, వారి ఆదేశాలు, జిల్లా కలెక్టర్, ఎస్పీల సమక్షంలో శాండ్‌ కమిటీ తీసుకొన్న నిర్ణయం మేరకే నగరిలో ఇసుక రీచ్‌ ఏర్పాటు చేశారన్నారు. పేదల ఇళ్లకు అక్కడి నుంచి ఇసుక తీసుకెళ్తున్నారన్నారు. ఈ ప్రకియ పారదర్శంగా అందరికీ తెలిసే జరుగుందన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేసి ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు ప్రచారం చేయడం జిల్లా మంత్రితో పాటు జిల్లా అధికారులను కూడా కించపరచడమే అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారైతే మైన్స్‌ మినిష్టర్‌కు ఫిర్యాదు చేసేవారని, అలా చేసుంటే నిజానిజాలు తేలేదన్నారు. ఇలా పార్టీకి నష్టం చేసేలా సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారు కారన్నారు. 
 
 
తహసీల్దార్‌ ఈ అంశంపై పూర్తి వివరణ ఇచ్చినా ఇదే అంశంపై డీజీపీని కలిసిన ఫోటోను సైతం వాడేవారు కారన్నారు. జగనన్న ఆశయమైన పేదలకు ఇల్లు పథకానికి గానీ, జిల్లా మంత్రులకు తలవంపులు తెస్తుంటే చూస్తూ ఊరుకోమన్నారు. డీజీపీకి కూడా ఈ అంశాన్ని వివరించడం జరిగిందని, ఆయన సూచనల మేరకే ప్రజలను పక్కదారి పట్టించే వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని ఎస్పీని కోరామ‌న్నారు.  వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని తప్పుచేసేవారు ఎవరైనా తప్పక శిక్ష అనుభవించాల్సిందే అన్నారు.