గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (16:11 IST)

లైంగిక వేధింపులను ప్రతిఘటించిందని.. 13 సెకన్లలో కత్తితో..?

బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని లైంగిక వేధింపులకు ప్రతిఘటించిందని.. ఆమెపై ఓ ఉన్మాది పలుమార్లు కత్తితో పొడిచాడు ఈ సంఘటన డిసెంబర్ 19న బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే.. బాలిక తన ఇద్దరు స్నేహితులతో కలిసి పాఠశాల నుండి ఇంటికి తిరిగి వస్తోంది. ఈ క్రమంలోనే తన సహచరులతో కలిసి దాక్కున్న ఓ నిందితుడు అకస్మాత్తుగా ఆమెపై కత్తితో దాడి చేశాడు. నిందితులు బాధితురాలిని 13 సెకన్లలో ఎనిమిది సార్లు కత్తితో పొడిచినట్లు తెలిసింది. 
 
ఈ సంఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్, సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది. ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన గోపాల్‌గంజ్‌లోని సదర్ ఆసుపత్రికి తరలించారు. 
 
అనంతరం మెరుగైన వైద్యం కోసం పాట్నా మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో చదువుకునేందుకు వెళ్లిన సమయంలో నిందితులు పలుమార్లు వేధించేందుకు ప్రయత్నించారని తెలిసింది.