ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 నవంబరు 2021 (09:35 IST)

ఇంట్లో అందమైన భార్య వున్నా.. తమ్ముడితో కలిసి ఆ పని చేశాడు..

ఇంట్లో అందమైన భార్య వున్నా.. అతడు వేరే మహిళతో అక్రమ సంబంధం జరిపాడు.  అడ్డుగా ఉన్న భార్యను చంపెయ్యాలనుకున్నాడు.. సొంత తమ్ముడితోనే కాంట్రాక్టు మాట్లాడుకుని భార్యను చంపించేశాడు.. చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన దీపిక హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. 
 
2019లో హత్యకు గురైన దీపిక కేసులో నిందితులను పట్టుకున్నారు. దీపిక హత్యకు భర్తే పథకం రచించాడని వెల్లడించారు. సొంత తమ్ముడు ఛోటు శర్మకు రూ.1.20 లక్షలు ఇచ్చి మర్డర్‌కు స్కెచ్ వేశాడు. అతడు మరో ఇద్దరిని నియమించుకుని సొంత వదినను తుపాకీతో కాల్చి చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
 
దాదాపు రెండేళ్ల విచారణ అనంతరం కిరణ్ కుమార్‌ను, ఛోటు శర్మను, దీపిక హత్యల పాలు పంచుకున్న మరో ఇద్దరు షూటర్లను అరెస్ట్ చేశారు. తన వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను పెళ్లి చేసుకోవడం కోసమే భార్యను చంపించానని పోలీసుల ఎదుట కిరణ్ ఒప్పుకున్నాడు.