తెరాస పార్టీలో చేరనున్న నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు అధికార తెరాసలో చేరనున్నారు. ఇందులోభాగంగా, నల్గొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు.. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావులు గులాబీ కండువా కప్పుకోనున్నారు.
వీరిద్దరు శుక్రవారం సీఎం కేసీఆర్‌ను కలవడం, ప్రభుత్వానికి అనుగుణంగా వ్యాఖ్యలు చేయడంతో ఆ ఇద్దరు నేతలు పార్టీలు మారతారనే నమ్మకం బలపడుతోంది. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు పూర్తి మద్దతిస్తున్నానని, రీ డిజైనింగ్‌ను స్వాగతిస్తున్నానని చెబుతూ, టీ ప్రాజెక్టులపై ఏపీ సీఎం బాబు చేసిన వ్యాఖ్యలను గుత్తా ఖండించడం కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని వీడనున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
కాగా, కేసీఆర్‌ను కలిసిన విషయమై గుత్తా స్పందిస్తూ, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం విషయమై మాట్లాడేందుకే తాను కేసీఆర్‌ను కలిశానని చెప్పారు. మరోవైపు.. ఇప్పటికే టీ టీడీపీకి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరిన విషయం తెల్సిందే. అలాగే,