ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 ఆగస్టు 2024 (09:23 IST)

హిందూపురంలో కొత్త బస్సును నడిపిన బాలయ్య

Balakrishna
Balakrishna
నందమూరి బాలకృష్ణ హిందూపురంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో భాగంగా హిందూపురంలో కొత్త ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే బాలయ్య ప్రారంభించారు. 
 
అటు సినిమాల్లో, ఇటు నిజ జీవితంలో ఏ వాహనాన్ని అయినా నడిపే బాలయ్య .. బస్సు ప్రారంభోత్సవం సందర్భంగా స్టీరింగ్ పట్టి బస్సును కొద్ది దూరం నడిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
తమ సమక్షంలో బాలకృష్ణ నేరుగా బస్సు డ్రైవింగ్ చేయడంతో అధికార యంత్రాంగం, తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి కొత్త బస్సులు రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.