శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 15 జులై 2019 (12:07 IST)

జీతాలు ఇవ్వండి మహాప్రభో... నందిగామ ఆస్పత్రి నర్సుల డిమాండ్

గత కొన్ని నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదని అందువల్ల తక్షణం తమకు వేతనాలు ఇవ్వాలంటూ నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై వారు నల్ల బ్యాడ్జీలు ధరించి వినూత్న నిరసన తెలిపారు. 
 
గత ఆరు నెలలుగా జీతాలు అందక ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామంలో అప్పులు బాధలు తట్టుకోలేక నాగేశ్వర్ రెడ్డి అనే స్టాఫ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు జీతాలు విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాని డిమాండ్ చేసిన ల్యాబ్ టెక్నీషియన్స్..... లేని పక్షంలో అందోళన మరింత ఉధృతం చేస్తానంటున్న వారు హెచ్చరించారు.