శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 15 మార్చి 2017 (02:28 IST)

భూమా అంటే గౌరవం ఉంది కాబట్టే 3 అసెంబ్లీ స్థానాలిచ్చాం.. బాబు నిలువునా చంపేశారు

వైఎస్ఆర్ సీపీ చరిత్రలో ఏ కుటుంబానికి ఇవ్వనంత గౌరవాన్ని దివంగత నేత భూమా నాగిరెడ్డికి వైఎస్ జగన్ కల్పించారని, ఆయన ఒక్క కుటుంబానికే మూడు అసెంబ్లీ స్థానాలను కేటాయించారని వైఎస్సార్ సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తమ పార్టీకి భ

వైఎస్ఆర్ సీపీ చరిత్రలో ఏ కుటుంబానికి ఇవ్వనంత గౌరవాన్ని దివంగత నేత భూమా నాగిరెడ్డికి వైఎస్ జగన్ కల్పించారని, ఆయన ఒక్క కుటుంబానికే మూడు అసెంబ్లీ స్థానాలను కేటాయించారని వైఎస్సార్ సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే  వై. విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తమ పార్టీకి భూమా అందించిన సేవల పట్ల గౌరవం ఉంది కాబట్టే ఏ కుటుంబాన్ని ఆదరించని విధంగా జగన్ ఆదరించారని గుర్తు చేశారు. భూమా కుటుంబానికి మూడు అసెంబ్లీ స్థానాలు కేటాయించారని, నాగిరెడ్డికి పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారని తెలిపారు. శోభా నాగిరెడ్డి మరణించినప్పుడు జగన్, వారి కుటుంబం అందరికంటే ఎక్కువ బాధ పడిందని గుర్తు చేశారు.
 
భూమా కుటుంబం పడుతున్న బాధలో పాలుపంచుకుంటాం, కానీ అసెంబ్లీలో సంతాపం పేరిట వైఎస్ జగన్ ను, వైఎస్సార్ సీపీని విమర్శించి వివాదస్పదం చేశారని విశ్వేశ్వర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం బాధాకరమని రెండేళ్లలో వ్యవధిలో శోభా నాగిరెడ్డి, ఆమె భర్త మరణించడం కలచివేసిందని పేర్కొన్నారు. 
 
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో కలిసి విలేకరులతో మాట్లాడిన విశ్వేశ్వరరెడ్డి ఏ సంస్కారంతో చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. ఏ సంస్కారం ఉందని  ఫిరాయింపు ఎమ్మెల్యేలతో జగన్ పై విమర్శలు చేయిస్తున్నారని నిలదీశారు. నైతికత గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు, టీడీపీకి లేదన్నారు. ఫిరాయింపులపై హైకోర్టు, స్పీకర్‌ దగ్గర పోరాటం చేస్తున్నామని తెలిపారు. నంద్యాల సీటు వైఎస్సార్ సీపీదేనని విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.