శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 సెప్టెంబరు 2021 (15:04 IST)

గన్నవరం ఎయిర్ పోర్టులోనే నారా లోకేష్ అరెస్ట్

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌‌ను గన్నవరం ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకున్నారు. ఆయన పర్యటనకు ఎలాంటి అనుమతులు లేవని చెప్పి అదుపులోకి తీసుకున్నారు. భారీ భద్రత మధ్య ఆయన్న విజయవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలను నెట్టి.. లోకేష్ ను అదుపులోకి తీసుకున్నారు. 
 
అయితే బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి అనుమతులు ఏంటి..? అని లోకేష్ వాగ్వాదానికి దిగినా పోలీసులు మాత్రం వినలేదు. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
అయితే ఉదయం నుంచి లోకేశ్‌ నరసరావుపేట పర్యటనపై సర్వత్రా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచే గుంటూరు జిల్లాలో పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.