సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 8 మార్చి 2017 (21:55 IST)

5 నెలల్లో నారా లోకేష్ ఆస్తులు 23 రెట్లు... వామ్మో...?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఆస్తులు 5 నెలల్లో 23 రెట్లు పెరిగిపోయాయంటే నమ్ముతారా..? నమ్మక తప్పదు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ వేసిన సందర్భంలో నామినేషన్ పత్రంపై తన ఆస్తుల వివరాలను లోకేష్ వివరించారు. తన ఆస్తుల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఆస్తులు 5 నెలల్లో 23 రెట్లు పెరిగిపోయాయంటే నమ్ముతారా..? నమ్మక తప్పదు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ వేసిన సందర్భంలో నామినేషన్ పత్రంపై తన ఆస్తుల వివరాలను లోకేష్ వివరించారు. తన ఆస్తుల వివరాలను తెలుపుతూ మొత్తం విలువ 330 కోట్ల రూపాయలని చూపారు. 
 
కానీ గత ఏడాది అక్టోబరు నెలలో ఆయన సమర్పించిన ఆస్తుల వివరాలకి ఇప్పుడు తెలిపిన ఆస్తుల వివరాల్లో భారీ అంతరం కనిపించడం గమనార్హం. అక్టోబరు 19, 2016న ఆయన మీడియాకు తన ఆస్తుల మొత్తం విలువ రూ. 14.5 కోట్లుగా వెల్లడించారు. ఐతే ఇప్పుడు వాటి విలువ ఒక్కసారిగా రూ. 330 కోట్లకు చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే ఆయన సతీమణి బ్రాహ్మ‌ణి పేరిట రూ.5.38 కోట్లు, దేవాంష్ పేరిట రూ.11.70 కోట్లు ఉన్న‌ట్లు గతంలో చూపగా ఇప్పుడు బ్రాహ్మ‌ణి ఆస్తులు రూ.28 కోట్లుగా చూపించారు. నారా దేవాన్ష్ ఆస్తుల్లో తేడా లేదు.