శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (12:46 IST)

జిన్నా టవర్ వివాదం.. జాతీయ జెండా తొలగింపు.. టెన్షన్

Jinnah
జిన్నా టవర్ వివాదం మరోసారి వివాదానికి దారితీసింది. టవర్ దగ్గర ఉన్న జాతీయ జెండాను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దీంతో గుంటూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. జిన్నా టవర్ పేరు మార్చాలని బీజేపీ ఆందోళన నిర్వహిస్తోంది. అబ్దుల్ కలాం టవర్‌గా మార్చాలని, టవర్‌పై జాతీయ జెండా ఎగురవేయాలని డిమాండ్ చేసింది. 
 
ఈ నేపథ్యంలో వివాదం ముదరడంతో కార్పొరేషన్ అధికారులు జిన్నా టవర్‌కు జాతీయ రంగులు వేయించారు. అక్కడే జెండా దిమ్మ ఏర్పాటు చేసి, జాతీయ జెండాను ఎగురవేశారు. ఇప్పుడు దిమ్మెతో సహా జాతీయ జెండాను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు.