గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: సోమవారం, 24 జూన్ 2019 (16:40 IST)

108 వచ్చిందాకా ఎందుకయ్యా... నా కారెక్కించండి, రోడ్డు ప్రమాద బాధితులకు మంత్రి అనిల్

రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి తక్షణ సాయం అందించడానికి చాలామంది ముందూవెనుకా ఆలోచిస్తుంటారు. ఐతే ప్రాణం ఎంతో విలువైనదన్న విషయం తెలిసినవారు రెప్పపాటు కూడా ఆలస్యం చేయరు. అదే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేశారు. 
 
సోమవారం నాడు ఆయన కలెక్టర్ల సదస్సుకు వస్తుండగా మార్గంలో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై బాధితులు పడిపోయి వుండటం చూసిన మంత్రి అనిల్, వెంటనే బాధితులను తన కారులో తీసుకెళ్లాలని కోరారు. ఐతే ఆలోపుగానే 108 వాహనం రావడంతో క్షతగాత్రులను అంబులెన్సులో తీసుకుని వెళ్లారు. ఇదంతా మంత్రి దగ్గరుండి పర్యవేక్షించారు.
 
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించిన తీరుపై స్థానికులు శభాష్ అంటున్నారు. ఘటనా స్థలంలోని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు మంత్రిగారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.