బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 6 ఆగస్టు 2017 (16:19 IST)

ఆషాడానికి పుట్టింటికి వెళ్లొచ్చి ఉన్నీతో ఉరేసుకున్న నవవధువు... ఎక్కడ?

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. ఆషాడానికి పుట్టింటికి వెళ్లిన ఓ నవవధువు భర్తతో మాట్లాడాక ఇంట్లోకి వెళ్లి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. ఆషాడానికి పుట్టింటికి వెళ్లిన ఓ నవవధువు భర్తతో మాట్లాడాక ఇంట్లోకి వెళ్లి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం తాళ్లచెరువుకు చెందిన అమరనాథ్‌ అనే వ్యక్తి దంత వైద్యశాల నడుపుతున్నాడు. మే నెలలో హైదరాబాద్‌కు చెందిన సుజల(27)తో అతనికి వివాహమైంది. 
 
వేరుకాపురం పెట్టేందుకు అమరావతిలోని విజయవాడ రోడ్డు సమీపంలో నెలరోజుల క్రితం ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఆషాఢం రావడంతో సుజల పుట్టింటికి వెళ్లి మూడు రోజుల క్రితం అమరావతి చేరుకుంది. శనివారం ఉదయం యథావిధిగా పనులు చేసుకుని మధ్యాహ్నం దంపతులిద్దరూ కలసి భోజనం చేశారు. ఆ తర్వాత సాయంత్రం వైద్యశాలకు వెళ్లిన అమరనాథ్‌ తిరిగి ఇంటికి వచ్చేసరికి వంట గదిలో భార్య చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు.