గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 28 జనవరి 2017 (21:55 IST)

ఆకులు ఎత్తేసే వారి(పవన్ కళ్యాణ్) వద్దకు వెళితే ఏం చేస్తారూ... జనసేన చీఫ్‌పై కిష్టప్ప సంచలనం

పవన్ కళ్యాణ్ - తెదేపాకు రోజురోజుకీ దూరం ఎక్కువవుతున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే తెదేపా నాయకులు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తెదేపా ఎంపీ నిమ్మల క

పవన్ కళ్యాణ్ - తెదేపాకు రోజురోజుకీ దూరం ఎక్కువవుతున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే తెదేపా నాయకులు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తెదేపా ఎంపీ నిమ్మల కిష్టప్ప చేసిన వ్యాఖ్యలను చూస్తే ఇదే కనిపిస్తోంది. 
 
ఇటీవల తమ సమస్యలను తీర్చాలంటూ పద్శశాలీయులు పవన్ కళ్యాణ్ ను కలిశారు. పవన్ వారి సమస్యలపై పోరాడుతానని హామీ ఇచ్చారు. ఐతే దీని ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ... అన్నం పెట్టేవారు(చంద్రబాబు నాయుడు) వద్దకు కాకుండా ఆకులు ఎత్తేసేవారు(పవన్ కళ్యాణ్) వద్దకు వెళితే ఏం వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వల్ల ఏమీ సాధ్యం కాదనీ, ఏది కావాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని చెప్పుకొచ్చారు.