సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 7 ఆగస్టు 2021 (13:47 IST)

అమ్మాయిలతో వళ్లు తెలియని వ‌ల్ల‌భా డ్యాన్స్ డ్యాన్స్, సీఐ స‌స్పెన్ష‌న్

గుంటూరులో ఒక హోట‌ల్‌లో అస‌భ్య నృత్యాల‌లో పాల్గొన్న సీఐని స‌స్పెండ్ చేస్తూ, ఎస్పీ ఉత్త‌ర్వుల‌ను జారీ చేశారు. వ‌ల్ల‌భా అంటూ, ఆరుగురు అమ్మాయిల మ‌ధ్య హీరోయిజం ప్ర‌ద‌ర్శించిన ఆ సి.ఐ. కెరీర్ ఇక ముగిసిన‌ట్లే అని ఉన్న‌తాధికులు పేర్కొంటున్నారు.
 
నాలుగు రోజుల క్రితం గుంటూరులో ఒక హోటల్‌లో పుట్టిన రోజు వేడుకలు జ‌రిగాయి. దీనిపై నగరంలో రేవ్‌ పార్టీ అంటూ కలకలం రేగింది. పార్టీకి హాజరైన సీసీఎస్‌ సీఐపై సస్పెన్షన్‌ వేటు పడింది.
 
గుంటూరు నగరంలోని ఇన్నర్‌ రింగు రోడ్డు సమీపంలో ఉన్న తెలుగింటి రుచులు రెస్టారెంట్‌లో రాకేష్‌ అనే వ్యక్తి జన్మదిన వేడుకలు జరిగాయి. అయితే పార్టీలో భాగంగా తన స్నేహితులతో కలిసి మద్యం సేవించటంతో పాటు, విజయవాడ నుంచి పిలిపించిన ఆరుగురు యువతులతో అసభ్య నృత్యాలు కూడా చేయించారు.
 
దీనిపై ప‌క్కా సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు దాడి చేసి మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కోవిడ్‌ నిబంధనలు అతిక్రమించటం, అధిక శబ్ధాలతో ఇతరులకు ఇబ్బంది కలిగించడం, దీంతో పాటుగా మద్యం సేవించటం, అసభ్యకరమైన నృత్యాలు చేసిన కేసు నమోదు చేసి, స్వంత పూచీకత్తులపై పంపించి చేశారు.
 
కానీ, జరిగిన పార్టీకి అర్బన్‌ సీసీఎస్‌లో పని చేస్తున్న సీఐ వెంకటేశ్వర రావు కూడా హాజరయ్యారు. ఒకేసారి ఆరుగురు యువతులు, 19 మంది యువకులను తీసుకుని రావటంతో రేవ్‌ పార్టీ జరిగిందని సమాచారం. దినిపై ప‌క్కా వీడియోలు ల‌భించ‌డంతో పోలీసు ఉన్న‌తాధికారులు ఆయ‌న్ని సస్పెండ్ చేస్తూ, ఉత్త‌ర్వులు జారీ చేశారు.