బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 మార్చి 2024 (11:22 IST)

పెరిగిపోయిన నిమ్మకాయల ధరలు.. ఒక్క నిమ్మ పది రూపాయలు

lemon
నిమ్మకాయ ధరలు పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండ వేడి తీవ్రత పెరగడంతో నిమ్మకాయల ధరలు కూడా పెరిగిపోయాయి. ఇందుకు నిమ్మకాయల ఉత్పత్తి తగ్గడమే కారణమని వ్యాపారులు చెప్తున్నారు. నిన్నమొన్నటి వరకు 20 రూపాయలకు అరడజను నిమ్మకాయలు దొరకగా, నేడు వాటి ధర రూ. 40కి పెరిగింది. విడిగా అయితే ఒక్కోటి పది రూపాయలు పలుకుతోంది. కిలో ధర రూ.200లకు పెరుగుతోంది. 
 
నిమ్మకాయలు అత్యధికంగా ఉత్పత్తి అయ్యే కర్ణాటకలో ఈసారి వాటి ఉత్పత్తి దాదాపు 40 శాతం మేర పడిపోయింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఎక్కువగా నిమ్మ సాగవుతుంది. 
 
ఏపీలో 7 లక్షలు, కర్ణాటకలో 3 లక్షలు, తెలంగాణలో 1.5 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో నిమ్మకాయ ధరలు పెరిగిపోయాయి.