శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 15 మే 2018 (20:08 IST)

గంట ముందుగా ఇంటికి... ఏపీ ప్రభుత్వం ఆఫర్... ఎవరికి?

అమరావతి : రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా గంట ముందుగా ఇంటికి వెళ్లిపోవడానికి ముస్లిము ఉద్యోగులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు టీచర్లు, అవుట్ సోర్సింగ్, క

అమరావతి : రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా గంట ముందుగా ఇంటికి వెళ్లిపోవడానికి ముస్లిము ఉద్యోగులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు టీచర్లు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకూ ఈ వెసులుబాటు కల్పించించింది. 
 
ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకూ నెల రోజుల పాటు రంజాన్ మాసం ముగిసేవరకూ సాయంత్ర సమయంలో విధుల నుంచి గంట ముందుగా ఇంటికి వెళ్లిపోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చినట్లు ప్రభుత్వ సాధారణ పరిపాలన కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఆ ప్రకటనలో తెలిపారు.