సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 11 డిశెంబరు 2019 (12:55 IST)

ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలి- టీడీపీ సభ్యులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన పరిషత్‌లో పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని టిడిపి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఆర్టీసి టికెట్ ధరలు పెంచడంతో ప్రజలపై 1000కోట్ల రూపాయలు భారం పడుతోందని కావున పెంచిన ధరలను వెంటనే రుద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 
దానిపై రాష్ట్ర రెవెన్యూ శాఖామాత్యులు మరియు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ జోక్యం చేసుకుని ఆర్టీసీ చార్జీలు పెంచడానికి గల కారణాలు పై సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కావున సభ్యులు నిరసన విరమించాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాక ఆర్టీసీ చార్జీలు పెంచడానికి కారణాలతో పాటు ఆర్టీసీని అప్పుల్లో కి నెట్టిన వారెవరూ కూడా వివరంగా చర్చిద్దామని అన్నారు.
 
ముందుగా పెంచిన చార్జీలు తగ్గించాలని ఆతర్వాత ఆర్టీసీకి సంబంధించిన అంశాలు చర్చిద్దామని టిడిపి సభ్యులు పట్టుబట్టి వారి నిరసనను కొనసాగించారు. ఈ దేశంలో శాసన మండలి అధ్యక్షులు మహ్మద్ అహ్మద్ షరీఫ్ జోక్యం చేసుకుని సభా సాంప్రదాయాలు పాటిస్తూ వెంటనే సభ్యులు నిరసన విరమించాలని విజ్ఞప్తి చేశారు.అయినప్పటికీ టిడిపి సభ్యులు నిరసనను కొనసాగించడంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.