మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (12:49 IST)

పీల్చేందుకు గాలి.. తాగేందుకు నీరు లేనపుడు యురేనియం ఎందుకు? : పవన్ కళ్యాణ్

యురేనియం నిక్షేపాల కోసం నల్లమల అటవీ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టాలని పాలకలు నిర్ణయించారు. దీన్ని అనేక మది రాజకీయ నేతలతో పాటు.. సెలెబ్రిటీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పైగా, సేవ్ ది నల్లమల అనే పేరుతో ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. 
 
ఇదే అంశంపై జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. యురేనియం తవ్వకాలపై కొద్ది రోజుల్లో రాజకీయవేత్తలు, మేధావులు, నిపుణులు, పర్యావరణ ప్రేమికులతో రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పైగా, పీల్చేందుకు గాలి, తాగేందుకు నీరు లేనపుడు యురేనియం ఎందుకు అంటూ నిలదీశారు. 
 
అలాగే, సినీ నటుడు రాహుల్ రామకృష్ణ కూడా స్పందించారు. పీల్చేందుకు గాలి, తాగేందుకు నీరు లేనప్పుడు యురేనియం విద్యుత్తు శక్తితో ఏం చేసుకుంటామని ప్రశ్నించారు. నల్లమల అడవులను రక్షించేందుకు రాజకీయం ఉద్యమం చేయాలని మరో సినీనటుడు రాహుల్‌ రామకృష్ణ ట్విటర్‌లో పిలుపునిచ్చారు.