మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 6 నవంబరు 2016 (11:54 IST)

'జనసేన' బలోపేతంపై పవన్ కళ్యాణ్ దృష్టి... పలువురికి పార్టీ బాధ్యతల అప్పగింత

'జనసేన' బలోపేతంపై సినీ హీరో పవన్ కళ్యాణ్ దృష్టిసారించారు. దీనికి సంబంధించిన ఒక ప్రకటనను విడుద‌ల చేస్తూ అందులో ప‌లు విష‌యాలు పేర్కొంది. పార్టీ బ‌లోపేతంపై తాము దృష్టి సారించినట్లు, త‌మ నాయ‌కులు బొంగునూర

'జనసేన' బలోపేతంపై సినీ హీరో పవన్ కళ్యాణ్ దృష్టిసారించారు. దీనికి సంబంధించిన ఒక ప్రకటనను విడుద‌ల చేస్తూ అందులో ప‌లు విష‌యాలు పేర్కొంది. పార్టీ బ‌లోపేతంపై తాము దృష్టి సారించినట్లు, త‌మ నాయ‌కులు బొంగునూరి మహేందర్‌ రెడ్డి, నేమూరి శంకర్‌గౌడ్‌, పి.హరిప్రసాద్‌లకు జ‌న‌సేన పార్టీలో ప‌లు కీలక బాధ్యతలు ఇచ్చినట్లు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 
 
ప‌వ‌న్ క‌ల్యాణ్‌ జ‌న‌సేనను స్థాపించే సమయంలో పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఉన్న‌ మహేందర్‌ రెడ్డి తెలంగాణలో పార్టీ కో-ఆర్డినేట‌ర్‌గా కార్యక్రమాల బాధ్య‌త‌ల‌ను ఇక‌పై చూసుకోనున్నారు. జ‌న‌సేన తెలంగాణ ఇన్‌ఛార్జిగా నేమూరి శంకర్‌ గౌడ్‌, పార్టీ మీడియా విభాగ బాధ్య‌త‌ల‌ను సీనియర్ పాత్రికేయుడు పి.హరిప్రసాద్ నిర్వ‌హించ‌నున్నారు.