శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2019 (11:45 IST)

కాకినాడ వేదికగా పవన్ కళ్యాణ్ రైతు సౌభాగ్య దీక్ష

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దీక్షకు దిగారు. కాకినాడ వేదికగా సాగుతున్న ఈ దీక్ష రైతు సమస్యల కోసం చేస్తున్నారు. ఈ దీక్ష పేరు రైతు సౌభాగ్య దీక్ష అని నామకరణం చేశారు. ఈ దీక్ష కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 
 
కాకినాడ నగరంలోని జేఎన్‌టీయూ ఎదురుగా ఉన్న మైదానంలో పవన్ దీక్షకు కూర్చొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, మిల్లర్లకు ఇచ్చే ధాన్యానికి రశీదులు ఇవ్వాలనేది పవన్ ప్రధాన డిమాండ్. పవన్ కళ్యాణ్ దీక్షలో ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, సినీ నటుడు నాగబాబులు కలిసి పాల్గొన్నారు.
 
"ఉభయ గోదావరి జిల్లాల ధాన్యం రైతుల గోడు ప్రభుత్వానికి వినిపించేలా, 'రైతు సౌభాగ్య దీక్ష' పేరుతో గురువారం కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక రోజు నిరాహార దీక్ష. రైతుకు సంఘీభావం తెలుపుదాం, వారి కన్నీటిని తుడవడానికి ప్రయత్నిద్దాం!" అంటూ జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది.