శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 9 డిశెంబరు 2019 (19:53 IST)

దిశను అంత దారుణంగా హతమార్చితే రెండు బెత్తం దెబ్బలంటానా? నాని బ్రదర్స్‌కి అది రాదు: పవన్ కళ్యాణ్

దిశపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనలో తను నిందితులకు రెండు బెత్తం దెబ్బలు వేయాలని చెప్పినట్లు జరుగుతున్న ప్రచారంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించారు. అసలు వైసీపీలోని నాని బ్రదర్స్‌కి తెలుగు భాషలోని పదాలకు అర్థం తెలియకపోవడం వల్లనే ఈ సమస్య అంటూ సెటైర్ వేశారు. 
 
నిందితులు అంత దారుణంగా మహిళను హత్య చేస్తే బెత్తం దెబ్బలతో సరిపెట్టాలని మనిషనేవాడు ఎవరైనా అంటారా అని ప్రశ్నించారు. సింగపూర్ దేశంలో కేనింగ్ అంటారు... అంటే తాట వలిచేయడం, అది కూడా రోడ్డుపై పోకిరీల్లా తిరిగేవారి విషయంలోనే ఈ మాట చెప్పాను. దాన్ని తీసుకెళ్లి దిశ హత్య నిందితులకు ఆపాదించారంటూ వ్యాఖ్యానించారు పవన్ కల్యాణ్. 
 
ఇంకా ఆయన ట్విట్టర్లో ఇలా ట్వీట్ చేశారు. ''శ్రీ జగన్ రెడ్డి గారు నేతృత్వంలో నడుస్తున్న వైసీపీ ప్రభుత్వం మతమార్పిళ్లు, కూల్చివేతలు , కాంట్రాక్టు రద్దులు మీద పెట్టిన దృష్టి ,సగటు ప్రజల అవసరాలు మీద, రైతుల కష్టాల మీద పెట్టుంటే బాగుండేది. మీరు ప్రజలని క్యూలలో నుంచోపెట్టి చంపేకంటే , మీరు నియమించిన గ్రామ వాలంటీర్లను ఉపయోగించి ,ప్రజలు ఇళ్ల దగ్గరికే కిలో 25 రూపాయలకే ఉల్లిపాయల సరఫరా ఎందుకు చేయట్లేదో, Sri Jagan Reddy గారు  వివరణ  ఇవ్వాలి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు ,కానీ జగన్ రెడ్డి గారు చేసే మేలు ఉల్లి కూడా చెయ్యదు, అందుకే ఇంకా ఉల్లి ఎందుకు సిల్లీగా, అని దాని రేటు పెంచేశారు'' అని పేర్కొన్నారు.