శనివారం, 2 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 డిశెంబరు 2019 (14:37 IST)

జూలోని జంతువులకు అన్ని సదుపాయాలు దగ్గరకే వస్తాయి : నాగబాబు

అధికార పాలకలను లక్ష్యంగా చేసుకుని జనసేన పార్టీ నేత, సినీ నటుడు నాగబాబు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, ఉల్లి ధరలపై ఆయన వరుస ట్వీట్లు చేశారు. "ఉల్లిపాయలు కేజీ దొరకాలంటే రెండు మూడు గంటలు లైనులో నిలబడి తీసుకోవాలి. అది కూడా కేవలం ఒక కేజీ మాత్రమే. ఒక్కసారి మీరు లైన్‌లో నిలబడి తీసుకోండి. అప్పుడు తెలుస్తుంది కామన్ మాన్ కష్టాలు. అవునులే జూలో అన్ని సదుపాయాలు మీ దగ్గరకే వస్తాయి. మీకు తెలియదు. అప్పుడప్పుడు మనుషుల కష్టాలు కూడా తెలుసుకో". 
 
"రైతుల కష్టాలు మీకు తెలియవు. పవన్ కళ్యాణ్ మీద కోపం ఉంటే అతన్ని విమర్శించండి. కానీ రైతుల సమస్యల మీద వెటకారం చేయకండి.. నాశనైపోతారు. మీరు తిన్న ఇసుక మీకు అరిగిందేమో కానీ ఇసుక కొరత కారణంగా పనులు పోయి చనిపోయిన భవన నిర్మాణ కార్మికులు 50 మంది ఉసురు మీకు తగులుతుందని మాత్రం చెప్పగలను" అంటూ నాగబాబు మండిపడ్డారు.