శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 నవంబరు 2019 (12:42 IST)

నాగబాబు లేకున్నా నష్టం లేదా? హైపర్ ఆదికి బంపర్ ఆఫర్..

జబర్ధస్త్ షో నుంచి జడ్జిగా వ్యహరించిన మెగా బ్రదర్ నాగబాబు సహా కొందరు బయటకు వెళ్లిపోవడంపై మాజీ టీమ్ లీడర్ షేకింగ్ శేషు స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడిన షేకింగ్ శేషు... నాగబాబు ఎపిసోడ్‌పై పరోక్షంగా కామెంట్ చేశారు.

జబర్ధస్త్ అనేది ఒక బ్రాండ్ అని, అందులో నుంచి ఎవరూ బయటకు వెళ్లిపోయినా దానికి వచ్చే నష్టమేమీ లేదని చెప్పారు. జబర్ధస్త్ ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. భవిష్యత్తులోనూ మరెంతోమంది జబర్ధస్త్ ద్వారా వెలుగులోకి వస్తారనే నమ్మకం ఉందన్నారు. 
 
జబర్ధస్త్ నుంచి నాగబాబు వెళ్లిపోవడం వల్ల ఆ ప్రొగ్రామ్‌కు వచ్చే నష్టమేమీ లేదని... ఆయన కొన్ని ఎపిసోడ్లు జబర్ధస్త్‌కు దూరంగా ఉన్నా కార్యక్రమం క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదనే విషయాన్ని షేకింగ్ శేషు గుర్తు చేశారు.
 
ఇదిలా ఉంటే.. జబర్ధస్త్ నుంచి ఆది బయటకు వెళ్లిపోకుండా మల్లెమాల యూనిట్ ఆపగలిగిందని టాక్. ఇందుకు ఆయన కూడా కన్విన్స్ అయ్యారని వార్తలు వినిపించాయి. తాజాగా ఢీ ప్రొగ్రామ్ లేటెస్ట్ ప్రోమో ద్వారాలో హైపర్ ఆది తళుక్కుమన్నాడు. సుధీర్, ప్రదీప్‌తో కలిసి ఆది ఈ ప్రొగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఇకపై ఢీ కార్యక్రమంలో ఆది కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
ఇదిలా ఉంటే... జబర్ధస్త్, ఢీ కార్యక్రమాలు మల్లెమాల వారివే కావడంతో... హైపర్ ఆది జబర్ధస్త్ కెరీర్‌లో ఈ కొత్త ప్రోమో ఓ క్లారిటీ ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆది జబర్ధస్త్‌లో కంటిన్యూ అవుతున్నారు కాబట్టే ఢీ కార్యక్రమంలోనూ ఆయనకు అవకాశం ఇచ్చారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
 
మొత్తానికి జబర్ధస్త్‌లో హైపర్ ఆది కంటిన్యూ కాబోతున్నారనే విషయం ఢీ కొత్త ప్రోమో ద్వారా తేలిపోయిందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఆదికి మల్లెమాల డబుల్ ఆఫర్ ఇచ్చిందని టాక్ వస్తోంది.