ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 నవంబరు 2019 (15:13 IST)

జబర్దస్త్ నుంచి అవుట్.. సీరియస్ అయిన అనసూయ..

జబర్దస్త్ కామెడీ షో నుంచి యాంకర్ అనసూయ తప్పుకుందని వస్తున్న వార్తలపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఆ దేవుని దయవల్ల ఇంకా తాను జబర్దస్త్ అనసూయగానే ఉన్నాను అంటూ ట్వీట్ చేసింది. జబర్దస్త్‌ కామెడీ షోను వీడిపోతున్నట్లు వస్తున్న వార్తలపై వీలైనంత త్వరగా క్లారిటీ ఇస్తాను.
 
అప్పటి వరకు దయచేసి ఆగండి.. ఉన్నవి లేనివి రాసి తన నుంచి వచ్చే సున్నితమైన సమాధానాలను కోల్పోవద్దని సున్నితంగా వార్నింగ్ ఇచ్చింది. తాను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్లకు బాగా తెలుసు ఇది.. చివర్లో స్టాప్ ది జాబ్ లెస్ న్యూస్.. గెట్ ఎ లైఫ్ అనే హాష్ ట్యాగ్ ఇచ్చింది.
 
కాగా కొన్ని రోజులుగా అనసూయ జబర్దస్త్ కామెడీ షో నుంచి బయటికి వెళ్లిపోతుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పైగా ఆమె జీ తెలుగులో కనిపించడం.. అక్కడికి నాగబాబు కూడా వెళ్లిపోవడంతో ఈమె కూడా జబర్దస్త్ మానేసిందనే వార్తలు ఊపందుకున్నాయి. 
 
దీనిపై అనసూయ కూడా ఏం మాట్లాడకపోవడంతో అంతా నిజమే అని ఫిక్సైపోయారు. ఈ వార్తలపై ప్రస్తుతం అనసూయ స్పందించింది. త్వరలోనే ఈ వ్యవహారంపై క్లారిటీ ఇస్తానని వెల్లడించింది.