14వ ఏటనే తొలిముద్దు అనుభవం.. ఛాయ్‌లో ఇడ్లీ నంజుకుంటా (video)

rashmi gautam
సెల్వి| Last Updated: గురువారం, 21 నవంబరు 2019 (17:54 IST)
జబర్దస్త్ యాంకర్, యాక్ట్రస్ రష్మీ గౌతమ్ ముక్కుసూటిగా మాట్లాడేస్తుంది. అందం, అభినయం ఈమె సొంతం. యాంకర్‌గా, నటిగా ఈమెకు మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ వుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనూ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది.

అంతేగాకుండా డబ్బులిస్తే ఎక్స్‌పోజింగ్ చేయడానికైనా తనకు అభ్యంతరం లేదని రష్మీ ఇప్పటికే ప్రకటించింది. ఇక, బోల్డ్ కామెంట్లు చేయడంలో ఏ మాత్రం వెనకాడదు. అయితే డ‌బ్బుల కోసం.. లేదంటే మ‌న‌సుకు న‌చ్చే పాత్రలు చేయాలని రష్మీ చెప్పుకొచ్చింది. సామాజిక అంశాలపై ఎక్కువగా స్పందించే అలవాటు ఉన్న ఈ బ్యూటీ.. మహిళలపై రేప్‌ల విషయంలో, మూగ జీవాల సంరక్షణలో స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని చెబుతూ ఉంటుంది.

ముక్కుసూటిగా మాట్లాడే అలవాటు ఉన్న రష్మీ తన వ్యక్తిగత విషయాలను కూడా నిర్మోహమాటంగా చెప్పేస్తుంది. తాజాగా.. తొలి ముద్దు గురించి రష్మీ గౌతమ్ నిర్మొహమాటంగా చెప్పేసింది. తన 14వ ఏటనే తొలి ముద్దు అనుభూతిని పొందినట్లు వెల్లడించింది. అది కూడా అబ్బాయితోనేనని చెప్పేసింది. అంతేకాదు.. తనకు ఛాయ్‌లో ఇడ్లీ నంజుకొని తినే అలవాటు ఉందని కూడా తన సీక్రెట్ బయటపెట్టేసింది.
దీనిపై మరింత చదవండి :