శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 నవంబరు 2019 (11:22 IST)

రోజాగారితో కలిసి మంచిగా పనిచేశాం.. జబర్దస్త్ అలా హిట్ అయ్యింది..

జబర్దస్త్ కార్యక్రమం నుంచి నాగబాబు తప్పుకోవడంపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జబర్ధస్త్‌లో తన తోటి జబర్ధస్త్ షో జడ్జ్ రోజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగబాబు. ముందుగా మల్లెమాలలో అపుడు నేను ''అదుర్స్'' కార్యక్రమం చేస్తున్నాను. ఆ టైమ్‌లో తన పర్సనల్ మేనేజర్.. ఒకరు.. "జబర్ధస్త్" అనే ప్రోగ్రామ్ వస్తోందని కేవలం 25 ఎపిసోడ్లు ప్లాన్ చేశారని దానికి జడ్జ్‌గా ఉండాలని చెప్పారు. 
 
అంతేకాదు ఈ ప్రోగ్రామ్‌లో మీకు రాజకీయ విభేదాలున్న రోజాతో కలిసి పనిచేయాలని కూడా చెప్పారు. అది మీకిష్టమేనా అన్నారు. అపుడే ఆలోచించాను. ప్రత్యర్ధి పార్టీకి చెందిన వ్యక్తితో ఎందుకు కలిసి పనిచేయాలా ? వద్దా ? అని ఆలోచించాను. రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా క్రియేటివ్ ఫీల్డ్‌లో అవన్ని చూపించకూడదని నిర్ణయించుకున్నానని నాగబాబు వ్యాఖ్యానించారు.
 
ఈ ప్రోగ్రామ్‌లో రోజాగారితో కలిసి మంచి అండర్ స్టాండింగ్‌తో కలిసి పనిచేసానన్నారు. మా షో తొలి ఎపిసోడ్‌తోనే సూపర్ హిట్ అయింది. ఈ షో ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని మల్లెమల వాళ్లకు చెప్పానని నాగబాబు తెలిపారు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడంతో అలానే కొనసాగినట్లు నాగబాబు తెలిపారు.