బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (19:06 IST)

లేపాక్షి కళంకారీ బ్యాగును ఆద్యకు కొనిపెట్టిన పవన్ కల్యాణ్ (వీడియో)

Aadhya
Aadhya
ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆద్య కోసం కలంకారీ బ్యాగును కొనిపెట్టారు. లేపాక్షి సంస్థ ప్రదర్శించిన కళాకృతులను పవన్ కళ్యాణ్‌, ఆయన కుమార్తె ఆద్య తిలకించారు. 
 
అతిథుల గౌరవార్థం ఇచ్చే జ్ఞాపికలు, శాలువాలకు శాఖాపరంగా బడ్జెట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ తన శాఖకు కేటాయించిన సంబంధిత బడ్జెట్ నుంచి 40 శాతం మాత్రమే తీసుకొని మిగిలిన 60 శాతం తన సొంత సొమ్మును కలుపుకుని కళాకృతులతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్స్ సిద్ధం చేయాలని తన అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. 
 
వీటిలో కలంకారీ వస్త్రంతో తయారు చేసిన బ్యాగును ఆద్య కోరిక మేరకు పవన్ కొనిపెట్టారు. కొయ్య బొమ్మలను కూడా ఆద్య తిలకించారు. కూతురి ఆసక్తిని గమనించిన పవన్..  వివిధ రకాల బ్యాగ్, బొమ్మలు కొనుగోలు చేసి తన కుమార్తెకు కానుకగా పవన్ కళ్యాణ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.