ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 29 జనవరి 2018 (10:01 IST)

పరిటాల రవి ఇంట్లోకెళ్లి సోఫాలో కూర్చొన్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దివంగత పరిటాల రవి ఇంట్లోకెళ్లి... ఆయన కూర్చొన్న సోఫాలో కూర్చొన్నారు. తన అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఈఅరుదైన దృశ్యం చోటుచేసుకుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దివంగత పరిటాల రవి ఇంట్లోకెళ్లి... ఆయన కూర్చొన్న సోఫాలో కూర్చొన్నారు. తన అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఈఅరుదైన దృశ్యం చోటుచేసుకుంది. పవన్ చేపట్టిన పర్యటనలో భాగంగా, ఆదివారం ఉదయం అనంతపురంలోని మంత్రి పరిటాల సునీత నివాసానికి వెళ్లారు. మంత్రి కుమారుడు పరిటాల శ్రీరాం.. పవన్‌కు ఎదురేగి ఘనస్వాగతం పలికారు.
 
ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై మంత్రి సునీత, పవన్‌ కల్యాణ్‌, శ్రీరామ్‌, జలవనరులశాఖ అధికారులు సమీక్ష నిర్వహించారు. జిల్లాకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు అందించే ప్రక్రియను జలవనరుల శాఖ అధికారులను పవన్‌ అడిగి తెలుసుకున్నారు. 
 
పరిటాల రవి జీవించివున్న సమయంలో ఓ భూమి ఆక్రమణ వ్యవహారంలో హీరో పవన్ కళ్యాణ్‌ను పరిటాల రవి తన అనుచరులతో కిడ్నాప్ చేయించి అనంతపురం తీసుకెళ్లి గుండు కొట్టించినట్టు ప్రచారం జరిగింది. ఈ వార్తలను పవన్‌తో పాటు.. పరిటాల రవి భార్య, రాష్ట్ర మంత్రి పరిటాల సునీత కూడా ఖండించారు. ఈపరిస్థితుల్లో అనంతపురంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ నేరుగా పవన్ ఇంటికెళ్లి ఆతిథ్యం స్వీకరించడం గమనార్హం.