మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 27 జనవరి 2018 (18:54 IST)

అధికారం కంటే సమస్యలు తీర్చడమే ముఖ్యం : పవన్ కళ్యాణ్

తనకు అధికారం కంటే రైతు, బడుగు, బలహీన వర్గాల సమస్యలు తీర్చడమే ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శనివారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖీ సమావేశం నిర్వ

తనకు అధికారం కంటే రైతు, బడుగు, బలహీన వర్గాల సమస్యలు తీర్చడమే ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శనివారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖీ సమావేశం నిర్వహించారు. 
 
అనంతరం ఆయన మాట్లాడుతూ, జ‌న‌సేన పార్టీకి ఓటేయ‌మ‌ని తాను అడ‌గ‌నని, తనకు గెలవడం కంటే కూడా రైతుల సమస్యలు తీర్చడమే ముఖ్యమన్నారు. తనకు రైతు రాజైతే చాలని, తనకు అదే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. అత్య‌ధిక క‌ర‌వు మండ‌లాలు ఉన్న జిల్లా అనంతపురమని అన్నారు. కరవు సమస్యలంటూ ప్రభుత్వాలు ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతున్నాయని, ఇందుకోసం అన్ని విభాగాలు ఉన్నాయని, కానీ అవి స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయ‌డం లేదని ఆరోపించారు.
 
గెలుపు ఓటములు తనకు కొత్త కావని పవన్ కల్యాణ్ అన్నారు. రైతు రాజు కావాలని, బానిస కాకూడదని, రైతుల తరపున తాను పోరాడతానని చెప్పారు. ఇక ప్రభుత్వాలతో గొడవలు పెట్టుకునే ఉద్దేశం తనకు లేదని, కానీ, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరానికి కృషి చేస్తానని అన్నారు. 
 
అంతకుముందు ఆయన అనంతపురంలోని స్థానిక గుత్తి రోడ్డులో జనసేన తొలి కార్యాలయానికి భూమి పూజ చేశారు. జిల్లాలో కరవుపై అధ్యయనం చేయడం కోసమే తాను ఈ యాత్ర చేస్తున్నట్లు, ఎలాంటి సమస్యలు ఉన్నా పాలకులతో మాట్లాడి, పరిష్కారానికి కృషిచేస్తానని తెలియజేశారు.