శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By tj
Last Updated : శుక్రవారం, 26 జనవరి 2018 (17:27 IST)

పవన్ తొలిప్రేమ కంటే.. మాది హిట్ అవుతుంది: రాశీఖన్నా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పవన్‌ కల్యాణ్ మంచి మైలేజ్ ఇచ్చిన సినిమా కూడా అది. అలాంటి సినిమాను వేరే హీరో, హీరోయిన్లతో ప్లాన్ చేశారు క

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పవన్‌ కల్యాణ్ మంచి మైలేజ్ ఇచ్చిన సినిమా కూడా అది. అలాంటి సినిమాను వేరే హీరో, హీరోయిన్లతో ప్లాన్ చేశారు కొత్త దర్శకుడు వెంకి. హీరోగా వరుణ్‌ తేజ్, హీరోయిన్‌గా రాశీ ఖన్నాలు ఈ సినిమాలో నటిస్తుండగా కొంతమంది సీనియర్ నటులు కూడా సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 
అయితే ఈ సినిమా గురించి రాశీ ఖన్నా సూపర్ కామెంట్స్ చేసింది. ఈ చిత్రం తనకు మంచి పేరు సంపాదించిపెడుతుందని.. వరుణ్ తేజ్‌తో పోటీగా కలిసి సినిమాలో నటించానని చెప్పింది. 
 
అంతేకాదు పవన్ కళ్యాణ్‌‌కు వచ్చిన పేరు కన్నా తనకే ఎక్కువగా ఈ సినిమా ద్వారా పేరొస్తుందని రాశీఖన్నా ధీమా వ్యక్తం చేసింది. సినిమాలో తన పాత్ర మెప్పిస్తుందని.. ఇప్పటివరకు క్యారెక్టర్ అస్సలు లేదని రాశిఖన్నా చెప్పింది. డైరెక్టర్ వెంకి తనను కొత్తగా చూపించారని రాశీ స్నేహితులకు చెప్పుకొస్తోందట.