గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 జూన్ 2023 (21:15 IST)

వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారథికి గుండెపోటు

మాజీ మంత్రి, పెనుమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారథి గుండెపోటుతో ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు పరీక్షలు చేసిన వైద్యులు యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం పార్థసారథి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 
 
అశోక్ నగర్‌లోని టాప్ స్టార్ హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. పార్థసారథి గుండెపోటుకు గురయ్యారనే విషయాన్ని తెలుసుకున్న అభిమానులు, వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.