బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 మార్చి 2023 (11:01 IST)

40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో వున్నారు.. జగన్‌కు పక్షవాతం..? అనిత

Anita
ఎమ్మెల్సీ ఎన్నికలలో నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తే సస్పెండ్ చేశారని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. తమతో పాటు 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో వున్న విషయం తెలిస్తే జగన్ పక్షవాతం వస్తుందేమోనని తెలిపారు. 
 
ఏపీ సీఎం జగన్ రెడ్డి గంజాయిని రాష్ట్ర పంటగా మార్చిమా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అనిత ఎద్దేవా చేశారు. తిరుమల కొండపై గంజాయి పట్టుబడటం వైసీపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని తెలిపారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని ఊసరవెల్లి శ్రీదేవి అని మంత్రి అమర్‌నాథ్ సంబోధించడం దారుణమన్నారు.