ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 13 మార్చి 2023 (18:09 IST)

మంచి కంటెంట్ ఉంటె పిల్లల సినిమాలను ఆదరిస్తారు : దిల్ రాజు

neha, dilraju
neha, dilraju
గోపురం స్టూడియోస్‌ పతాకంపై నేహా ముఖ్యప్రాతలో వేదాంత్‌ వర్మ, ప్రణితారెడ్డి బాలనటులుగా నటించిన ఈ చిత్రంలో రాజ్‌వీర్‌ ముఖ్య పాత్ర పోసిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శివమ్‌ ను దర్శకునిగా పరిచయం చేస్తూ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కె.బాబురెడ్డి, జి.సతీష్‌ కుమార్‌లు నిర్మించిన చిత్రం "లిల్లీ" .ఈ చిత్ర  ట్రైలర్ ను సోమవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘లిల్లీ’ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.
 
అనంతరం గెస్ట్ గా వచ్చిన నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...RRR సినిమాతో ప్రపంచం వ్యాప్తంగా  తెలుగు సినిమా , ఇండియన్ సినిమాకు మంచి పేరు తీసుకు రావడమే  కాకుండా ఆస్కార్ ఆవార్డ్ వచ్చేలా తీసిన టీం అందరికీ  మా ధన్యవాదములు. నా చైల్డ్ వుడ్ లో శివ కృష్ణ గారి సినిమాలు ఆడపడుచు, అనాదిగా ఆడది లాంటి ఫ్యామిలీ ఎమోషన్, ఫ్యామిలీ వ్యాల్యూస్ ఉన్న సినిమాలు విపరీతంగా నచ్చేవి.నాకు ఎమోషన్ కలిగినప్పుడల్లా అనాదిగా ఆడదిలో ఉండే ఊరుకో వదినమ్మ అనే సాంగ్ ను హమ్ చేస్తుంటాను. తను నాకు .నాకు చైల్డ్ వుడ్ లో  గుర్తుండిపోయారు. అలాంటి మీరు ఈ సినిమా టైలర్ లాంచ్ కు పిలవగానే రావడం జరిగింది. ఇలాంటి చిన్న పిల్లలు సినిమాలు తియ్యాలని ఎంకరేజ్ చేస్తున్న శివ కృష్ణ అన్న గారికి ధన్యవాదాలు. చిన్న సినిమా లకు అంటే నాకు చాలా ఇష్టం. లిటిల్ సోల్జర్స్,  అంజలి సినిమాలు చాలా ఇష్టం. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సిసింద్రీ సినిమా ను నైజాం లో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మంచి కాన్సెప్ట్ తో చిల్డ్రన్స్ మీద  సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు.ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తుంటే పిల్లలందరూ చాలా బాగా చేశారు. వాళ్లతో సినిమా చేయాలని ఆలోచన వచ్చిన నిర్మాతలు, దర్శకులు శివమ్ గార్లకు ఆల్ ద బెస్ట్. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.
 
చిత్ర నిర్మాతలు కె.బాబురెడ్డి, జి.సతీష్‌ కుమార్‌  లు మాట్లాడుతూ...మేము తీస్తున్న  తొలి చిత్రం "లిల్లీ".ఈ సినిమాతో పాటు తమిళ్ లో కూడా రంగోలి సినిమా చేస్తున్నాము..అక్కడ కూడా దిల్ రాజు కు మంచి పేరు ఉంది. ఇలాగే వారు అన్ని భాషల్లో మంచి సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నాను.ఈ రోజు తను వచ్చి మా "లిల్లీ" సినిమా ట్రైలర్ ను విడుదల చేసినందుకు వారికి  మా ధన్యవాదములు..దర్శకుడు శివమ్ చిన్న పిల్లలపై   సినిమా చేద్దాం అని ఈ కథ చెప్పడం జరిగింది. కథ నచ్చడంతో తనను దర్శకుడుగా పరిచయం చేస్తూ ఈ సినిమా తీశాము. ఈ సినిమా కొరకు సీనియర్ నటులు శివకృష్ణ గారు చాలా మంచి సపోర్ట్ చేశారు వారికీ మా ధన్యవాదాలు. ఇందులో నటించిన వారందరూ చిన్న పిల్లలు కాదు రేపటి స్టార్స్.వారంతా చక్కగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.