గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (17:40 IST)

మంచు మనోజ్‌ పెండ్లి ఎక్కడో తెలుసా! మోహన్‌బాబు గైర్హాజరు కానున్నారా!

jubli hils house and manchu family
jubli hils house and manchu family
ఇప్పుడు రెండు ఆసక్తివిషయాలు సినిమా రంగంలోని మంచు ఫ్యామిలీలో జరగబోతున్నాయి. మంచు విష్ణు వివాహ వార్షికోత్సవం, మరోటీ మనోజ్‌ ద్వితీయ వివాహం. ఈనెల 3వ తేదీన మంచుమనోజ్‌ ద్వితీయ వివాహం టిడిపి నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికారెడ్డితో జరగబోతోంది. ఆర్భాటంగా జరగనున్నదని వార్తలు వచ్చినా పరిమిత కుటుంబీకుల సమక్షంలో జరగనుందని తెలుస్తోంది. పెండ్లి ఎక్కడనేది ఆసక్తిగా మారింది. ఆ ప్లేస్‌ ఎక్కడంటే, జూబ్లీహిల్స్‌లోని ఇంతకుముందు మంచు మోహన్‌బాబు నివాసం వుండే ఇల్లే. ఇప్పుడు అందులో లక్ష్మీప్రసన్న, మనోజ్‌ కలిసి వుంటున్నారు. మౌనికా రెడ్డి కూడా అక్కడే సహజీవనం చేస్తుందని గుసగుసలు కూడా ఫిలింనగర్‌లో కొంతకాలంగా వినిపించాయి.
 
ఇప్పుడు ఆ ఇంటిలో పెండ్లి సందడి మొదలైంది. గత రెండురోజులుగా ఆ ఇంటిని అలంకరించే పనిలో సిబ్బంది వున్నారు. ఇప్పటికే ద్వారాల దగ్గర పెద్ద పెద్ద మాలలు అలంకరించి లోపలలకు మండపంకు సంబంధించిన వస్తువులను చేరుస్తున్నారు. అపోలోకు వెళ్ళే దారికావడంతో ఫిలింనగర్‌లో సెంటర్‌ భాగం కావడంతో ఇప్పటికే ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడిరది. 
 
ఇదిలా వుండగా, మంచు మోహన్‌బాబు, విష్ణు ఈ వివాహానికి రారనే వార్త ప్రబలంగా వినిపిస్తుంది. మనోజ్‌ గతంలోనే ఆస్తిపంపకాల విషయంలో గొడవ పడ్డాడని మోహన్‌బాబు సన్నిహితులు తెలియజేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలవల్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాలకు చెందిన కుటుంబంతో వియ్యం అందడం ఇష్టంలేదని తెలుస్తోంది. ఇప్పటికే జగన్‌ కుటుంబానికి చాలా దగ్గరైన మోహన్‌బాబు ఇటీవలే లండన్‌ వెళ్ళారు. కానీ ఆయన తిరిగి వచ్చినట్లు దాఖలాలు లేవు. కొందరైతే నేరుగా తిరుపతి వెళ్ళి అక్కడే యూనివర్శిటీ పనుల్లో బిజీగా వున్నారని చెబుతున్నారు. ఇక మంచు విషుకూడా అదే రోజు వెడ్డింగ్‌ యానివర్శీ జరుపుకోనున్నారు. లక్ష్మీ ప్రసన్న మనోజ్‌ వివాహ వేదుకలను పర్యవేక్షించడం విశేషం.