సోమవారం, 25 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (15:42 IST)

రానా దగ్గుపాటి రిలీజ్ చేసిన మంచు లక్ష్మి ప్రసన్న అగ్నినక్షత్రం గ్లింప్స్

Manchu Lakshmi
Manchu Lakshmi
మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం 'అగ్ని నక్షత్రం'. వంశీక్షష్ణ మళ్ల దర్శకత్వం వహంచారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ బ్యానర్లపై మంచు మోహన్‌ బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా గ్లింప్స్ వాలంటైన్స్ డే సందర్బంగా నటుడు దగ్గుపాటి రానా రిలీజ్ చేయటం జరిగింది, ఈ గ్లింప్స్ కి ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వస్తుంది, త్వరలో ఈ చిత్రం యొక్క విడుదల తేదిని ప్రకటించడం జరుగుతుంది.
 
ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిక్, యువ హీరో విశ్వంత్, చైత్ర శుక్లతో పాటు భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించారు. మధు రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
తారాగణం :డా మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి ప్రసన్న, సిద్దిక్, విశ్వంత్, చైత్ర శుక్ల తదితరులు.