సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (11:12 IST)

మంచు విష్ణు, విరానికా రెడ్డి వెడ్డింగ్ యానివర్సరీ

Manchu Vishnu, Viranika Reddy
Manchu Vishnu, Viranika Reddy
డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కుటుంబంలో ఒక్క మోహన్ బాబు భార్య మంచు నిర్మలాదేవి తప్ప  మిగిలిన వారందరూ నటులుగా రాణిస్తున్నారు.అయితే వీరిలో మంచు విష్ణులో ఒక ప్రత్యేకత ఉంది. సినిమారంగంలో ఉన్న తను అప్పటి ముఖ్యమంత్రి వై. యస్ రాజశేఖర్ రెడ్డి మేనకోడలు విరానికా రెడ్డిని ప్రేమించి 2009 లో  పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు వారికి నలుగురు సంతానం.అటు నటుడుగా రాణిస్తూనే ఒకడుగు ముందుకు వేసి మా అధ్యక్షులుగా పోటీచేసి అందరి అంచనాలను తలక్రిందలు చేస్తూ గెలుపొందడం జరిగింది. నేడు వారి వెడ్డింగ్ యానివర్సరీ. పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
 
Manchu Vishnu family
Manchu Vishnu family
నటుడుగా, నిర్మాతగా (24 ఫ్రెమ్స్ ఫ్యాక్టరీ), మా  అసోసియేషన్ అధ్యక్షులుగా మరో వైపు తండ్రి స్థాపించిన విద్యా సంస్థలను చూసుకుంటూ బిజీగా ఉన్న తనకు అండగా నిలబడింది భార్య విరానికా రెడ్డి, తను రాజకీయ కుటుంబం నుండి వచ్చినా కూడా డిజైనర్ గా చేస్తూనే మోహన్ బాబు విద్యా సంస్థలలోని న్యూయార్క్ అకాడమీ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా రాణిస్తున్న తను తాజాగా లండన్, దుబాయ్, దోహ వంటి వివిధ దేశాలలో కూడా బోటిక్ సంబందించిన  బ్రాంచి లను నెలకొల్పడానికి సిద్దమైంది. ఇలా వీరిద్దరిదీ వివిధ రంగాలైనా కూడా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న మంచు విష్ణు, విరానికా రెడ్డి పెళ్లి రోజు మార్చి 1 సందర్బంగా వీరు ఇలాగే అందరికీ ఆదర్శంగా నిలుస్తూ బిజినెస్ పరంగా, సినిమా పరంగా  రాణిస్తూ సక్సెస్ కపుల్ గా నిలవాలని  కోరుతూ పెళ్లి రోజు శుభాకాంక్షలు..