1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YCP leader Kapu Ramachandra Reddy Warns Villagers

సమస్యలు ప్రస్తావిస్తే చెప్పుతో కొడతా : గ్రామస్థులకు వైకాపా ఎమ్మెల్యే కాపు వార్నింగ్

kapu ramachandra reddy
తాను వచ్చినపుడు సమస్యల గురించి ప్రస్తావిస్తే చెప్పుతో కొడతానని గ్రామస్థులకు వైకాపా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి హెచ్చరించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం గోవిందవాడలో బుధవారం నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయనకు గ్రామస్థులు తమ సమస్యల గురించి మొరపెట్టుకున్నారు. 
 
తమకు ప్రతి నెలా రేషన్ సరకులు రావడం లేదని వాపోయారు. పక్కా ఇళ్లు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పైగా, ఈ నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారని ఇక్కడకు వచ్చారంటూ నిలదీశారు. ఈ మాటలతో కాపు రామచంద్రారెడ్డికి ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన వద్ద సమస్యల గురించి ప్రస్తావిస్తే చెప్పుతో కొడతానంటూ పచ్చి బూతులతో దూషించారు. 
 
ఆ సమయంలో అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ సైలెంట్‌గా ఉండిపోయారు. పైగా, పోలీసులతో కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించండతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, స్థానిక వైకాపా నేతలు గ్రామస్థులకు సర్దిచెప్పడంతో స్థానికులు శాంతించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
'ది కేరళ స్టోరీ' ఎఫెక్ట్ : మాజీ ప్రియుడిపై వర్ధమాన మోడల్ ఫిర్యాదు..