మరదలిపై అక్కమొగుడు అత్యాచారం, గర్భం దాల్చడంతో...

rape
ఆర్. సందీప్| Last Updated: శనివారం, 23 మే 2020 (19:30 IST)
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని ఓ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్క మొగుడు 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసాడు. ఆమె గర్భందాల్చడంలో అబార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చాడు. ఈ క్రమంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

వివరాల్లోకి వెళితే, కంచిలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తెను కోల్‌కతాలో పనిచేసే వ్యక్తికి ఇచ్చి కొంతకాలం క్రితం పెళ్లి చేసారు. జనవరిలో అత్త ఇంటికి వచ్చిన అతను మరదలిని మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. పలుమార్లు అఘాయిత్యం చేసి గర్భం దాల్చేలా చేసాడు.

గర్భందాల్చిన కుమార్తెను గమనించి తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. కోల్‌కతాలో ఉన్న అల్లుడికి ఫోన్ చేసి నిలదీయగా, లాక్‌డౌన్ పూర్తయ్యాక వచ్చి మాట్లాడుకుందామని జవాబు ఇచ్చాడు. ఈ విషయం తెలిస్తే ఇరు కుటుంబాల పరువు పోతుందని బెదిరించాడు. అబార్షన్ చేయించమని, దానికి అయ్యే ఖర్చులు తనే భరిస్తానని నమ్మబలికాడు.

తల్లిదండ్రులు బాలికను వారం రోజుల క్రితం సోంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించారు. ఇంటికి వెళ్లాక బాలిక ఆరోగ్యం క్షీణించడంతో మూడురోజుల క్రితం మళ్లీ అదే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి మెరుగుపడకపోవడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక చనిపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.దీనిపై మరింత చదవండి :