సోమవారం, 31 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 మార్చి 2025 (22:31 IST)

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Chandra babu
Chandra babu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కాలంగా వాయిదా పడుతున్న పోలవరం ప్రాజెక్టును ఈ పదవీకాలం చివరి నాటికి పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా, ఆయన క్షేత్రస్థాయిలో పోలవరం నిర్మాణ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. 
 
పనులు శరవేగంగా ముందుకు సాగేలా పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తుంచారు. ఇందులో భాగంగా చంద్రబాబు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడి నిర్మాణ కార్యకలాపాలను పరిశీలించారు.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ.."పోలవరం నిర్వాసితులను ఆదుకోవడం మన బాధ్యత. గత ప్రభుత్వం నిర్వాసితులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత 9 నెలల్లో, ఎక్కడా అవినీతి లేకుండా రూ. 829 కోట్లను నిర్వాసిత ప్రజల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసిన ఘనత మన సంకీర్ణ ప్రభుత్వానికి ఉంది." బాబు పేర్కొన్నారు.
 
2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టును తన ప్రభుత్వం పూర్తి చేస్తుందని చంద్రబాబు ప్రకటన చేశారు. ఆ సమయంలోనే నిర్వాసితులకు ప్యాకేజీలను అందజేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ఏపీ సీఎం చంద్రబాబు పనులను పర్యవేక్షిస్తున్న చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.