శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 జులై 2024 (16:39 IST)

ఆఫీసులో కూర్చుని పబ్జీ ఆడుతారా.. సస్పెండ్ చేయండి.. బాలరాజు (video)

BalaRaju
BalaRaju
పోలవరం ఎమ్మెల్యే బాలరాజు అంటేనే ఫైర్. జనసేన ఫైర్ బ్రాండ్ అని కూడా చెప్పవచ్చు. ఆయన ఫైర్ బ్రాండ్ అంటే ఏదో నోటికి పని చెప్పరు. చేతల్లోనే ఆయన సూపర్ లీడర్ అనిపించుకుంటున్నారు. గతవారం వరదల సందర్భంగా ఫీల్డ్‌లోకి దిగి తెలుగు రాష్ట్రాల ప్రజల మన్ననలు పొంది.. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. 
BalaRaju
BalaRaju
 
తాజాగా కన్నాపురం ఆఫీసులో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మాస్కు ధరించి ఆఫీసులోపలికి వచ్చిన ఆయన డీవైఈవో సెక్షన్ ఓఎస్ సాయికుమార్ విధులను దుర్వినియోగం చేస్తూ ఆఫీసులో పబ్జి గేమ్ ఆడటం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సస్పెండ్ చేయమని అధికారులకు ఆదేశించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.