సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2019 (15:17 IST)

పోలీసులకు లొంగిపోయిన ఎమ్మెల్యే రాపాక

తన అనుచరులతో కలిసి మలికిపురం పోలీస్ స్టేషన్‌పై దాడికి యత్నించారన్న ఆరోపణలపై కేసు నమోదు కావడంతో, జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ మంగళవారం పోలీసులకు లొంగిపోయారు. 
 
పేకాడుతూ పట్టుబడిన వారికి వత్తాసు పలకడమే కాకుండా, 100 మంది అనుచరులతో వచ్చి, పోలీసులపై దౌర్జన్యం చేసి, ప్రభుత్వ ఆస్తిని నష్టపరిచారనే అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి. 
 
ఈ ఘటనలో స్టేషన్‌పై ఎమ్మెల్యే అనుచరులు రాళ్లు రువ్వారు. కిటికీల అద్దాలను పగులగొట్టారు. ఈ దాడి కేసులో ఏ-1గా రాపాక వరప్రసాద్ పేరునే చేర్చడంతో, ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు.