మాస్క్ ధరించని మహిళలకు పోలీసుల క్లాస్!
బయట ఎక్కువగా తిరిగేది మగవాళ్ళే... వాళ్ళు అజాగ్రత్తగా ఉంటారని అందరూ అంటుంటారు. కరోనాపై అసలు కేర్ తీసుకోరని భావిస్తుంటారు. కానీ, మహిళలే ఎక్కువ అలసత్వం వహిస్తున్నారని, వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటపుడు అసలు మాస్క్ ధరించడం లేదని అంటున్నారు... పోలీసులు.
ఎందుకంటే, వెహికల్ చెకింగ్ లో ఎక్కువగా మాస్క్ లేని మహిలలే పట్టుపడుతున్నారు. విజయవాడ శివారు గొల్లపూడిలో వెహికల్ చెకింగ్ చేస్తుంటే, కనిపించిన దృశ్యాలివి.
విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, ఆదేశాల మేరకు భవాని పురం పోలీస్ స్టేషన్ పరిధిలో గొల్లపూడి వన్ సెంటర్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించిన ఎస్ ఐ. ఎం వి వి రవీంద్ర బాబు వాహనాల తనిఖీల నిర్వహణ లో గొల్లపూడి ప్రాంతవాసులు, ముఖ్యంగా మహిళలు ఎక్కువగా మాస్కులు ధరించక పోవడంతో, వారందరి వాహనాలు ఆపి, ఎస్ఐ రవీంద్రబాబు, కరోనా వైరస్ పై ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి వాహనాల రికార్డులు తనిఖీలు నిర్వహించి చలనాలు విధించారు.
ఇంట్లో ఉన్నపుడు ఎలాగూ మాస్క్ ధరించడం లేదని, ఇంటి బయటకు వచ్చినా అదేలా అశ్రద్ధ వహించడం తగదని పేర్కొన్నారు. కరోనాకు ఎటువంటి బేధం లేదని, అందరినీ అది కాటేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ ఎం వి వి రవీంద్రబాబు, హెడ్ కానిస్టేబుల్ నాగేంద్రం, మహిళా కానిస్టేబుల్ శోభిత, తదితర సిబ్బంది పాల్గొన్నారు.