గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 1 డిశెంబరు 2021 (15:00 IST)

మహాపాద యాత్రకు సర్వేపల్లిలో అడ్డంకులు... మ‌హిళ‌ల ధ‌ర్నా

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మరుపూరు సమీపంలో అమ‌రావ‌తి మ‌హా పాద యాత్ర‌కు ఆటంకం క‌లిగింది. దీనితో పోలీసుల తీరు నిర‌స‌న‌గా అమరావతి రైతులు ఆందోళనకు దిగారు. పాదయాత్రలో సర్వ మతాలకు సంబంధించిన వాహనాలకు అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. వాహనాలను త‌మ‌తో పంపాలని రైతులు ఆందోళన చేయ‌డంతో ఇరువ‌ర్గాల‌కు మ‌ధ్య పోలీసులతో వాగ్వాదం జ‌రిగింది. 
 
పాదయాత్ర ప్రారంభం నుంచి వస్తున్నవాహనాలకు లేని అభ్యంతరం, ఇప్పుడెందుకని రైతులు ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించారు. మ‌హిళ‌లు రోడ్డుపై కూర్చుని ఆందోళన చేపట్టారు. దీనితో అమ‌రావ‌తి 
రైతులకు పలు రాజకీయ పార్టీ నేతలు, ప్రజలు మద్దతు ప‌లికారు. ఈ ఆందోళ‌న‌, ధ‌ర్నాతో పొదలకూరు మార్గంలో కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు నిలిచిపోయాయి. 
 
 
అమరావతి మహా పాదయాత్రకు నెల్లూరులో ఆటంకాలు కల్పించడం, భోజనాల ఏర్పాట్లను తొలగించటం క్షంతవ్యం కాద‌ని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఖండించారు.  మ‌హా పాద‌యాత్ర‌కు ఎలాంటి ఆటంకాలు జరక్కుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. ఇది 
అమరావతి ఉద్యమం 5 కోట్ల ఆంధ్రుల ఉద్యమం అని ముప్పాళ్ల నాగేశ్వరరావు చెప్పారు.