స్థానిక సంస్థల ఎన్నికలల్లో వేలికి సిరా ఇలా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగనున్న స్థానిక ఎన్నికలల్లో ఓటు వేసిన ఓటర్లకు ఎక్కడ ఎలా సిరా గుర్తు పెడతారో అధికారులు తెలిపారు. కృష్ణా కలెక్టర్ జె నివాస్ ఒక ప్రకటన ద్వారా ఈ వివరాలను తెలిపారు.
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఈనెల 14 న ఆదివారం నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించునే ఓటరు ఎడమ చేతి చూపుడు వేలుకు చెరగని సిరా గుర్తు వేస్తారని, జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి జె. నివాస్ తెలిపారు. అదేవిధంగా ఈనెల 16న మంగళవారం నిర్వహించే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటరు ఎడమ చేతి చిటికెన వేలికి చెరగని సిరా గుర్తు వేస్తారని పేర్కొన్నారు.
ఓటర్లు పోలింగ్ బూత్ ల వద్ద సమన్వయంతో వ్యవహరించాలని, కోవిడ్ నిబంధనలను తప్పక పాటించాలని అధికారులు తెలిపారు. మాస్కులేకుండా పోలింగ్ బూత్ లోకి ప్రవేశం ఉండదని, అలాగే, ఎవరూ గుంపులు గుంపులుగా బూత్ లోకి ప్రవేశించరాదని తెలిపారు. కోవిడ్ వ్యాప్తిని ప్రోత్సహించకుండా, అంతా దూర దూరంగా ఉండి పోలింగ్ ఒకరి తర్వాత ఒకరు నిర్వహించాలని కోరారు. దీనికి సంబంధించి అధికార బందోబస్తు పూర్తయిందని, పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.