గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ప్రముఖ సాహితీవేత్త సి.నరసింహారావు కన్నుమూత

cnarasimharao
వ్యక్తిత్వ వికాసంపై అనేక పుస్తకాలు రచించిన ప్రముఖ సాహితీవేత్త, సామాజిక, రాజకీయ విశ్లేషకుడు సి.నరసింహారావు ఇకలేరు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 73 యేళ్లు. బుధవారం అర్థరాత్రి పొద్దుపోయిన తర్వాత 1.50 గంటలకు తుదిశ్వాస విడిచారు.
 
కాగా, ఈయన స్వగ్రామం కృష్ణా జిల్లాలోని పెదపాలపర్రు. 1948 డిసెంబరు 29వ తేదీన ఆయన జన్మించారు. హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డారు. ఆయన మృతివార్త తెలిసిన అనేక మంది రాజకీయ, సామాజిక, సాహితీవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతిని తెలిపారు. కాగా, ఆయన అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్, పంజాగుట్టలోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.