శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 మే 2021 (11:18 IST)

కరోనా కాటుకు ప్రముఖ జర్నలిస్ట్ TNR మృతి

TNR
కరోనా కారణంగా ప్రముఖ జర్నలిస్ట్‌, యాంకర్‌, నటుడు టీఎన్‌ఆర్‌ (తుమ్మల నరసింహా రెడ్డి) మృతి చెందారు.  'ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR' అంటూ సూటిగా, సుత్తి లేకుండా ఇంటర్వ్యూలు చేసే టీఎన్‌ఆర్‌కు యూత్‌లోనూ మంచి క్రేజ్‌ ఉంది. 
 
టిఎన్ఆర్‌కు అనారోగ్యం అని తెలియగానే ఆయన కోలుకోవాలంటూ పలువురు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక టీఎన్‌ఆర్‌ మృతి పట్ల పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. 
 
మొదట హోం ఐసోలేషన్‌లో ఉన్న టీఎన్‌ఆర్‌ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించడంతో మరణించారు. కాగా టీఎఆర్ ఇటీవ‌ల వ‌చ్చి ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య చిత్రంలోను ఓ ముఖ్య పాత్ర‌లో కనిపించి అల‌రించారు.